నరాలు సేదతీర్చే లేతవెన్నెల
అదో ఇష్టసమాధిలోకి తీసుకుపోయిన రేయి
సంకల్పిత ప్రసారమంతా నీవైపుకేగా
అంతర్వేదం నిన్ను స్మరిస్తున్న సంతోషం
ఏకాంతముతో సంధి కుదిరే సమయం
వెన్ను పులకరించేదొక్క నీ పిలుపుకేగా
చీకటి ముసుగేసుకున్న నా చిరునవ్వు
నువ్వు కల్పించుకున్న చిత్రమైనా
జతగా నన్నొదలని నువ్వో అవ్యక్తం
జీవనదికి వరదొచ్చినట్టి అస్తిత్వమే
నీకు దూరంగా నిలబడ్డ నా మౌనమైనా
నీకెలా వినబడిందో ఆ మనసుపాట
అంతులేని నిశ్శబ్దం నిజం కాదులే మన మధ్య
అనంగ గంగలా నువ్వు ప్రవహిస్తుంటే ఓపక్క
తడపొద్దని వేడుకుంటున్నా పొగమంచుని మరోపక్క 💕💜
అదో ఇష్టసమాధిలోకి తీసుకుపోయిన రేయి
సంకల్పిత ప్రసారమంతా నీవైపుకేగా
అంతర్వేదం నిన్ను స్మరిస్తున్న సంతోషం
ఏకాంతముతో సంధి కుదిరే సమయం
వెన్ను పులకరించేదొక్క నీ పిలుపుకేగా
చీకటి ముసుగేసుకున్న నా చిరునవ్వు
నువ్వు కల్పించుకున్న చిత్రమైనా
జతగా నన్నొదలని నువ్వో అవ్యక్తం
జీవనదికి వరదొచ్చినట్టి అస్తిత్వమే
నీకు దూరంగా నిలబడ్డ నా మౌనమైనా
నీకెలా వినబడిందో ఆ మనసుపాట
అంతులేని నిశ్శబ్దం నిజం కాదులే మన మధ్య
అనంగ గంగలా నువ్వు ప్రవహిస్తుంటే ఓపక్క
తడపొద్దని వేడుకుంటున్నా పొగమంచుని మరోపక్క 💕💜
No comments:
Post a Comment