పనిలేక పరుగులెత్తే గాలి
ఆవిరై ఎటు దాగిపోయిందో..
నోరెండి తాగిన చెరుకు తీపులన్నీ
మిట్టమగ్గిన వేళకే వేదనలాయే
ఊహలేసిన ఉయ్యాల ఊగుదామంటే
నేలేమో నిలబడమని నిందలాయే
నిప్పుకోడి నవ్వులాంటి నిదురంతా
నివురేసిన రాతిరల్లే రగిలిపోయే..
ప్రాణమందుకే ఒంటరయ్యింది
కల్పించుకొని ఒక్క పాటా నువ్వు పాడలేదనే..


No comments:
Post a Comment