కన్నుల మీంచీ దించలేని నిద్దుర కావిడి
మిట్టమగ్గినా.. కలను మోస్తూ దిగనంటూంది
ప్రపంచమంత విశాలమైన హృదయంలో
పాలపుంతలూ..ఎన్నో పూలతోటలూ
ఎన్నో భాషలు..మరెన్నో రాగాలు
ఓవైపు నదీనదాలు..చెట్టూచేమలూ
ఎన్నో దృశ్యాలు..ఇంకెన్నో మనోన్మయ భావాలు
విషాదానికి చోటులేని బంగారులోకంలో
ఓ భావం అభావమవుతున్న వేళ
అంతరాత్మ ప్రతిధ్వనిస్తున్న అలికిడి
గుండెలోతుల్లో మొదలైన నిశ్శబ్దపు సంగీతమిది
నా స్వగతాన్ని నీకు వినిపించేందుకు చేస్తున్న అల్లరిది 💜💕
మిట్టమగ్గినా.. కలను మోస్తూ దిగనంటూంది
ప్రపంచమంత విశాలమైన హృదయంలో
పాలపుంతలూ..ఎన్నో పూలతోటలూ
ఎన్నో భాషలు..మరెన్నో రాగాలు
ఓవైపు నదీనదాలు..చెట్టూచేమలూ
ఎన్నో దృశ్యాలు..ఇంకెన్నో మనోన్మయ భావాలు
విషాదానికి చోటులేని బంగారులోకంలో
ఓ భావం అభావమవుతున్న వేళ
అంతరాత్మ ప్రతిధ్వనిస్తున్న అలికిడి
గుండెలోతుల్లో మొదలైన నిశ్శబ్దపు సంగీతమిది
నా స్వగతాన్ని నీకు వినిపించేందుకు చేస్తున్న అల్లరిది 💜💕
No comments:
Post a Comment