Saturday, 11 April 2020

// నీ కోసం 105 //

కాలాతీతమైన అనుబంధమేమో తెలీదు
వెన్నెలా..సముద్రానికి సమంగా
నువ్వూ ఇష్టమయ్యావంటే

మబ్బు మీద మబ్బులా
మెత్తగా ఒదిగినప్పుడల్లా అనుకుంటా
నువ్వు స్పర్శించేది హృదయాన్నే కదాని

లోకంలో ఉన్న ఇన్ని కాంక్షలూ దిగదుడుపే
నన్ను ప్రణయిస్తున్న నీలోని తలపు
ఆత్మానందాన్ని అనుభవంగా నాకందిస్తుంటే

పులకించిన ప్రతిసారీ పువ్వునై
నీ మానసికోల్లాసంలో ముగ్ధనై
ఎప్పటికీ నీ నేనే..నీకు మాత్రమే నేను..💕

No comments:

Post a Comment