Saturday, 11 April 2020

// నీ కోసం 108 //

 
మనోవిహంగం కోరుకున్న కలలా
మబ్బుల్లో చేరి ప్రయాణం మొదలెట్టి
నీలి కనుమల పాటలకు
చలనమొచ్చిన తీరుగా గమిస్తూ
అందనంత దూరానున్న నీవైపొచ్చింది

నీ పదాల్లో మిలమిల మెరిసే ప్రణయం
నా ఊపిరిలో పరిమళాన్ని నింపిన వైనం
మన ఇద్దరి అడుగులూ చెరోసగంగా ఎదురై
రాతిరిని తీపి చేసిన సంతోషం
చీకటి తరిగిపోయి వెన్నెలైన శుభసమయం

ఇప్పుడయినా చెప్పూ..
మాటగా మారని మౌనాన్నీ..కాగితం లేకుండా కవితల్నీ
రాలుతున్న ఆకుల్లో రాగాల్నీ..నాకే ఎందుకు పంచుతున్నావో..

సంకల్పించిన వెచ్చదనం.. ప్రాణాన్ని ఊపుతున్న సుగంధం...
శాశ్వతంగా కావాలనుంది
మల్లెలూ కనకాంబరాలూ కలిసిన
కదంబం మనమేనని మరోసారి చెప్పూ..💕💜

No comments:

Post a Comment