Thursday, 9 April 2020

// నీ కోసం 83 //

కదులుతున్న కాలానికి ఆనందపు స్వేదం పుట్టిందంటే..
జీవితపు కొత్త అధ్యయానికి నేపథ్యం
నిన్నటి విరిగిన మనసుముక్కల్ని తిరిగి అతికించుకోబోతున్న ఆరాటం..

అవ్యక్తమైన మంజీర ధ్వనులు
కృతులకు ఆకృతినిస్తుంటే
గుండెపొరల్ని కదిలించే పాటొకటి మొదలైనట్టు..

చిరునవ్వుల తొలకరితో మదిలో మొలకెత్తిన భావం
మనోశిశిరపు నిరాశలు రాలిపోయిన తరుణం
చలనం లేని హృదయానికిదో సంచలనం

తలపులు దారి తప్పాయంటే నేనొప్పుకోను
రాగానికి తాళమయ్యేందుకే.. అనువదించరాని అనుభూతినై
నీ మానససరోవరంలో కలహంసగా తడుస్తున్నా నేనపురూపమై.. 💕💜

No comments:

Post a Comment