Saturday, 11 April 2020

// నీ కోసం 106 //



కదలని కాలానికి కధలల్లి చెప్తూ
శిలగా మారుతున్న జీవితాన్ని కుదిపే
అనుభూతుల మల్లెదండలా
మృదువెచ్చని వశీకరణాలు కదా
హత్తుకుపోయే నీ పదాలు

యుగాంతాలు దాటిన
హృదయస్పర్శకి స్పందనుందంటే
గుండె మావితోటకి నిత్యవసంతమేమో కానీ
నువ్వు మాత్రం
చిక్కుముడి వీడని మైకంలా
అంతుబట్టని అనుబంధంలా అంటుకొనే ఉన్నావు

అయితే..
నా మనసు అగచాట్లు తెలుసుకున్న కాగితం
తానే ఓ ఆకాశంగా మారి
అంతరంగాన్ని ఆవిష్కరించమని నన్నూ తొందరపెడుతుంది
కంటిముసురు కురిసేలోగా.. నువ్వు
నన్ననుగ్రహిస్తే నీ ఆరాధనవుతానట..
మూసిన రెప్పలు ఎప్పుడు విప్పుతావో చెప్పు
నే నిదురించి చాలా కాలమయ్యిందిక్కడ..😊💜

No comments:

Post a Comment