నా నవ్వులకి
వంత పాడుతూ నువ్వు
ఎప్పుడూ ఆనందానుభూతిలో ఉంటావేమో
నాలో నూతనోత్తేజాన్ని నింపేందుకు
నీ లిప్తలన్నీ నాకు వెచ్చిస్తావు
గాయపడ్డ గుండె గాయాన్ని
మాయం చేసే నీ చూపులు
పాటకట్టి పరవశాన్ని అందిస్తుంటే
ప్రణయపు ఆకలి అలా తీరిపోతుంది
నువ్వేం చెప్పకపోయినా
నీ మనసు నాకు బాసటయ్యిందని తెలిసాక
ఆ శ్వాసలో పరిమళం
నా నరనరాలకు పాకుతుంది
పరుగాపని క్షణాలన్నీ
నీ స్వగతమయ్యేందుకు వస్తుంటే
మురిపాన్నిలా మౌనంగా ముడేసుకుంటున్నా
హ్మ్
ముగ్ధంగానేలే..💕💜
వంత పాడుతూ నువ్వు
ఎప్పుడూ ఆనందానుభూతిలో ఉంటావేమో
నాలో నూతనోత్తేజాన్ని నింపేందుకు
నీ లిప్తలన్నీ నాకు వెచ్చిస్తావు
గాయపడ్డ గుండె గాయాన్ని
మాయం చేసే నీ చూపులు
పాటకట్టి పరవశాన్ని అందిస్తుంటే
ప్రణయపు ఆకలి అలా తీరిపోతుంది
నువ్వేం చెప్పకపోయినా
నీ మనసు నాకు బాసటయ్యిందని తెలిసాక
ఆ శ్వాసలో పరిమళం
నా నరనరాలకు పాకుతుంది
పరుగాపని క్షణాలన్నీ
నీ స్వగతమయ్యేందుకు వస్తుంటే
మురిపాన్నిలా మౌనంగా ముడేసుకుంటున్నా
హ్మ్
ముగ్ధంగానేలే..💕💜
No comments:
Post a Comment