ఎంతకని చూస్తావలా
అనంతాకాశం సముద్రంలో కలిసినట్టున్న దృశ్యం
ఒకరికొకరం తపిస్తున్నా ఎప్పటికీ
కలవని మనలా కనిపిస్తుందనా
నీ మనసుపొరల్లో రేగే అలజడి
నా మువ్వలశబ్దానిదని గుర్తించా కనుకనే
రాగాల్ని దాచుకున్న మౌనమై నే మూగబోయా
అదిమిపెట్టుకున్న నీలో అనురాగం
పూలసువాసనలా నన్నల్లుకుందనే
మంత్ర విహంగమై జాబిల్లినే చుట్టి వచ్చా
నివేదించలేని మనోవేదన దాచిన నీ కన్నుల్లో
నేనున్న కలనెప్పుడో చూసేసుకున్నందుకే
సగంలో నువ్వాపిన కవితలు నేను పూర్తి చేస్తున్నా
నే పలుకుతున్న స్వరాలు గతజన్మవని తెలిసాక
అతీతమైన విషాదం అలౌకికమైందని
అరుదైన నీ క్షణాలు నావేనన్న నిజమూ తెలుసుకున్నా 💕💜
అనంతాకాశం సముద్రంలో కలిసినట్టున్న దృశ్యం
ఒకరికొకరం తపిస్తున్నా ఎప్పటికీ
కలవని మనలా కనిపిస్తుందనా
నీ మనసుపొరల్లో రేగే అలజడి
నా మువ్వలశబ్దానిదని గుర్తించా కనుకనే
రాగాల్ని దాచుకున్న మౌనమై నే మూగబోయా
అదిమిపెట్టుకున్న నీలో అనురాగం
పూలసువాసనలా నన్నల్లుకుందనే
మంత్ర విహంగమై జాబిల్లినే చుట్టి వచ్చా
నివేదించలేని మనోవేదన దాచిన నీ కన్నుల్లో
నేనున్న కలనెప్పుడో చూసేసుకున్నందుకే
సగంలో నువ్వాపిన కవితలు నేను పూర్తి చేస్తున్నా
నే పలుకుతున్న స్వరాలు గతజన్మవని తెలిసాక
అతీతమైన విషాదం అలౌకికమైందని
అరుదైన నీ క్షణాలు నావేనన్న నిజమూ తెలుసుకున్నా 💕💜
No comments:
Post a Comment