Friday, 10 April 2020

// నీ కోసం 98 //



గుండె నిండా గాలిపీల్చుకున్నప్పటి ధ్యానంలో
వెచ్చని నవ్వు ప్రకంపనై
నిశ్శబ్దాన్ని నియంత్రించి మంత్రమేసిందంటే
ఊహలోకి నువ్వు చొరబడినట్టే

రెప్పల తలపుల వెనుక
నీకు రెక్కలు మొలిచి
నావైపుకి ఎగిరొచ్చావంటే
ఆ పయనం తొలిపొద్దు ఏటవాలుగా మొదలైనట్టే

మూకుమ్మడిగా ముత్యాలు రాలినట్లు
కొన్ని కిలకిలలు
నా బెంగ తీర్చేందుకు
నువ్వు ముద్రించిన అరుదైన ఆనవాళ్ళవే

కన్నులు తెరిచే వేళయిందిక
అనురక్తిగా తడిపిన అనుభూతి రాగం
మనసు తడిమి పలకరించాక
ఇంతింతైన ఆనందం అద్వితీయ యోగమైనట్టే 💜

No comments:

Post a Comment