Friday, 10 April 2020

// నీ కోసం 97 //

నువ్వు గుర్తుకొచ్చే క్షణాలల్లా
నేను పుస్తకమైపోతా

నన్ను చదువుతూంటావనే నమ్మకమే
శిథిలం కాని నా పెదవులపై చిరునవ్వు

అస్పష్టపు జ్ఞాపకాల సంగమంలో
పరిమళించిన సమయం మనిద్దరిదేనని
గోధూళిస్వప్నాల అంచుల్లో నిలబడి చెప్తున్నా

మధురమైన ఈ నెమరింతలో
మానసిక దగ్గరతనం..
మనమందుకే ఒకరికొకరం వ్యక్తిగతం..💜

No comments:

Post a Comment