లేత వెన్నెల ఉల్లాసం తెలుస్తుంది
నేలకు దిగుతున్న మబ్బులు
మంచుపువ్వుల మోహపరవశాన్ని
అడవిమల్లెల పరిమళంగా మార్చి వెదజల్లుతుంటే
ఊపిరి అదుపుతప్పి
హృదయపు మడతలు విప్పుకుంటోంది
నిన్ను చేరదీసిన రెప్పల తాకిడిలో
మౌనమొక్కటే ప్రవహిస్తున్నట్టుంటే..
ఇంకిపోతున్న అలల నిట్టూర్పుని
ఆలకించి చూడొకసారి
అలుపెరుగని కేరింతల పాటలో
నా పిలుపులోని ఆర్తి మునివేళ్ళతో ముట్టినట్టుంటే
అలాంటిలాంటి రేయి కాదిది
గుండెల్లోని మహోద్రేకం
కన్నుల్లో కలవరంగా మారి
నిశ్శబ్దాన్ని ప్రేమానుభవముగా ప్రవచిస్తుందంటే..💜💕
నేలకు దిగుతున్న మబ్బులు
మంచుపువ్వుల మోహపరవశాన్ని
అడవిమల్లెల పరిమళంగా మార్చి వెదజల్లుతుంటే
ఊపిరి అదుపుతప్పి
హృదయపు మడతలు విప్పుకుంటోంది
నిన్ను చేరదీసిన రెప్పల తాకిడిలో
మౌనమొక్కటే ప్రవహిస్తున్నట్టుంటే..
ఇంకిపోతున్న అలల నిట్టూర్పుని
ఆలకించి చూడొకసారి
అలుపెరుగని కేరింతల పాటలో
నా పిలుపులోని ఆర్తి మునివేళ్ళతో ముట్టినట్టుంటే
అలాంటిలాంటి రేయి కాదిది
గుండెల్లోని మహోద్రేకం
కన్నుల్లో కలవరంగా మారి
నిశ్శబ్దాన్ని ప్రేమానుభవముగా ప్రవచిస్తుందంటే..💜💕
No comments:
Post a Comment