Saturday, 11 April 2020

// నీ కోసం 110 //

మనసు ఖాళీలు పూరిస్తూ నీ కవిత్వం
నా రుధిరానికీ మాటలు నేర్పించింది
రాత్రి రంగులో మిళితమైన నిశ్శబ్దానికి
తనువంతా ఊగేంత సంగీతం తోడిచ్చింది

అమాసనాటి ఆకాశంలో మూరెడు ముచ్చట్లు నువ్విసిరినట్టు
సగం నిద్రలో నాకవి వినిపించడం నిజమేనా చెప్పు

నెమలీకల కన్నులతో రంగురంగుల్లో నన్ను చూస్తూ
గాజు అద్దంలో చిత్రించిన రూపం
నీ అరచేతి కుంచెస్పర్శతోనే తీపెక్కిన పరవశం చూడు

రెప్పల్లో రెపరెపలాడుతున్న కలలు అలలై రేగేలోపు
గాలాడనంత గాఢానుభవమిచ్చి పో
వేళ్ళచివర పూస్తున్న పూలకో పేరు పెట్టాలి
సంతోషంలో తడిచేందుకింత ఏకాంతమసలే చానాళ్ళకు కుదిరింది 💜

No comments:

Post a Comment