Friday, 10 April 2020

// నీ కోసం 88 //


అవును నువ్వే..
నాకు నచ్చుతూనే నచ్చనట్టుంటూ
నీలో నువ్వున్నట్టు నన్నూ ఆలకిస్తావు
కొసరి కొసరి తీపి మాటలతో నా ఆకలినాపేస్తావు

నీ చిరునామా ఏదంటే..
గుట్టులేనట్టు నా గుండెల్లోకి చూస్తూ
శూన్యంతో నే పోరాడినప్పుడల్లా
కన్నుల కిటికీలోకి తొంగిచూస్తూ సద్దుమణిగిస్తావు

పెదవులు దాచుకున్న పాటని
చిన్న స్పర్శతో రాగరంజితం చేసి
దేహం కలవరించే కౌగిలినిచ్చి
కాలాన్ని కోల్పోయేంతగా కరగనిస్తావు..

వెన్నెలంత అందంగా నవ్వుతూ
నిద్దురంటని రాత్రికి చేర్చి
నా మనసంతా కాగితం చేసి
పువ్వులు పూయించడం నేర్పుతావు

నిజంగా ఈ పదాలు..
నువ్వు పేర్చినవేనంటే నమ్మలేరెవ్వరూ
నిన్నూ ననూ వేరుగా చూసే
ఆ నలుగురూ..😁💜

No comments:

Post a Comment