Thursday, 9 April 2020

// నీ కోసం 82 //

పున్నమిచెర వీడని రాతిరి
నా ఊహల సౌధంలో నువ్వు

హృదయం ఒలికే సమయానికే
కెరటంలా ఉరకలేస్తూ కమ్ముకున్నావు

తేనెలో తీపివో..చినుకులో వర్షానివోనని
ఆలోచించేలోపే గలగలమని నవ్వించావు

మెత్తగా నేనాలపిస్తున్న పాట
నీ మనసు రాసుకున్నదేనని కనిపెట్టేసావు..

వినీ వినిపించనట్టు నీ హృదయస్పందన
నాకిప్పుడో సుమధుర సావేరిరాగమయ్యింది..

నిశ్శబ్దం ఎక్కడుందిప్పుడు
కళ్ళతో కౌగిలించి నన్ను మచ్చిక చేసేసుకున్నప్పుడు 😉💜

No comments:

Post a Comment