Friday, 10 April 2020

// నీ కోసం 91 //

మౌనం నేపథ్యమైన సమయం
నాకు మాత్రం వినిపిస్తున్న మాటలు
నీ కన్నులు తెర తీసిన ఆనవాళ్ళు

మనసుకందనంత వేగంగా అదృశ్యమవుతూ కూడా
కనులకొలుకులో జారే నీటిబొట్టు ఆవిరయ్యేలోగా
ఎప్పుడంటే అప్పుడే..
నా తపస్సుకి ఫలసిద్ధిలా ఎదురవుతావు

మసక వెన్నెల్లోని నిశ్శబ్దానికో భావనొచ్చి
పెదవుల్లో చిరునవ్వు ప్రతిధ్వనిస్తే
మన మధ్య దూరం చెరిగినట్టే లెక్కంటావు

చలిని పెంచే తెలివేకువ చీకటిమబ్బులా
రచించని రాగాల్ని శృతిచేసేందుకు
తాపంతో కదులుతున్న గాలి అలవై తడుముతావు

నిదుర వలసపోయి యుగాలైనట్టనిపిస్తుంటే
మంద్రమైన పరవశపు స్వరం
నిన్నే పరమావధిగా పాడుతోంది
బహుశా నిర్మోహపు ధ్యానం ఇదేననిపిస్తుంది..💕

No comments:

Post a Comment