ఆత్మలు కలిసిన అద్భుతకావ్యంలో
మనిద్దరం పొందిన తాదాత్మ్యం
అరచేయి గిల్లుకొని చూసుకొనేలోగా..
మంచుతెరల దృశ్యకావ్యం నుండీ బయటపడి
ఊదారంగు పువ్వులచీర నడుమొంపున దోపి
నీకోసం నేనున్నానని చెప్పేలోగా..
నువ్విచ్చిన ముద్దులు దాచి
బుగ్గలపై సిగ్గులుగా మార్చి
నీకో తుంటరి గిలిగింత అందించేలోగా
కనురెప్పల మంగళకరమైన కబురు
వెచ్చగా నిన్నావహించేందుకు వస్తున్న వేళ..
కురవని కరిమబ్బులా కదిలిపోలేవులే 😊
అందుకే మరి..
నిన్నూ నన్నూ కలిపిన రెల్లుపూల మెరుపు కల
కాలానికి కృతజ్ఞతలు చెపుతోందిలా..💕💜
మనిద్దరం పొందిన తాదాత్మ్యం
అరచేయి గిల్లుకొని చూసుకొనేలోగా..
మంచుతెరల దృశ్యకావ్యం నుండీ బయటపడి
ఊదారంగు పువ్వులచీర నడుమొంపున దోపి
నీకోసం నేనున్నానని చెప్పేలోగా..
నువ్విచ్చిన ముద్దులు దాచి
బుగ్గలపై సిగ్గులుగా మార్చి
నీకో తుంటరి గిలిగింత అందించేలోగా
కనురెప్పల మంగళకరమైన కబురు
వెచ్చగా నిన్నావహించేందుకు వస్తున్న వేళ..
కురవని కరిమబ్బులా కదిలిపోలేవులే 😊
అందుకే మరి..
నిన్నూ నన్నూ కలిపిన రెల్లుపూల మెరుపు కల
కాలానికి కృతజ్ఞతలు చెపుతోందిలా..💕💜
No comments:
Post a Comment