దాగుడుమూతల వేకువ లయలో
నీతో మాటలాడే ప్రతిసారీ
వెన్నెలెందుకు కురుస్తుందో తెలీదు
చూసింది క్షణకాలం అనుకున్నా..
మూసిన రెప్పలమాటు చీకటిలో
ఎన్ని లిప్తలు కరిగాయో తెలీదు
ఆకుగుబుర్ల వెంట విరిసే పరిమళం
నీ పిలుపులోని ప్రేమే అయితే
ఈ పరవశానికి పేరేమో తెలీదు
కలిసింది కలలో అంటే నమ్మని మనసు
మౌనంగా నువ్వొచ్చి చేరగానే
గుండెల్లో గుట్టిగా ఎందుకు దాచుకుందో తెలీదు
నువ్వంటే..
తలవగానే తాకగల ఓ స్పర్శ నాకు..
మనసుని కౌగిలించి మురిపించు కవిత నాకు..💜💕
నీతో మాటలాడే ప్రతిసారీ
వెన్నెలెందుకు కురుస్తుందో తెలీదు
చూసింది క్షణకాలం అనుకున్నా..
మూసిన రెప్పలమాటు చీకటిలో
ఎన్ని లిప్తలు కరిగాయో తెలీదు
ఆకుగుబుర్ల వెంట విరిసే పరిమళం
నీ పిలుపులోని ప్రేమే అయితే
ఈ పరవశానికి పేరేమో తెలీదు
కలిసింది కలలో అంటే నమ్మని మనసు
మౌనంగా నువ్వొచ్చి చేరగానే
గుండెల్లో గుట్టిగా ఎందుకు దాచుకుందో తెలీదు
నువ్వంటే..
తలవగానే తాకగల ఓ స్పర్శ నాకు..
మనసుని కౌగిలించి మురిపించు కవిత నాకు..💜💕
No comments:
Post a Comment