నన్ను నేను మరచిపోయేంత నిరీక్షణ
నువ్వు మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిన ప్రతిసారీ
నడుస్తున్న నిట్టూర్పు మన మధ్య దూరాన్నే కాక
నా గుండెను పొడిబార్చుతుంది
విచ్చిన పువ్వులన్నీ పరిమళించడం మరిచినట్టు
కలతబారిన దీపాలు దిక్కులు చూస్తున్నట్టు
సంద్రం మీదలిగిన అలలు ఒడ్డును పరితపించినట్టు
ఉచ్ఛ్వాసనిశ్వాసలు లెక్కతప్పుతున్న ఊపిరులు
కొన్ని జన్మల ఎడబాటుని మోసుకు తిరుగుతున్న
విరాగిని నేను
కనుకనే నీ పలకరింపు ఎదురుతెన్నుల
ప్రణయ కలలు కంటూ బ్రతికున్నా..
No comments:
Post a Comment