ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే రాతిరి
ఈరోజెందుకో మోహపు మాటలు మొదలెట్టింది
అలలు అలలుగా పొంగుకొస్తున్న పదాల వల్లనేమో
తీపి మత్తులో హేమంతాన్ని వెచ్చబెడుతున్నట్టుంది
నా కనురెప్పల తలుపులు తోసుకొని
నువ్వొస్తావనుకున్న కల చూస్తుండగానే కరిగిపోయింది
ఆకుచాటు మల్లెమొగ్గ చిన్ని సువాసన వెదజల్లినట్టు
నా మెడ ఒంపున ఈ చిలిపి ఊపిరి లాహిరేమిటో మరి
అర్ధమైంది..
ధ్యానమంటూ కాటుక కళ్ళు చీకటైనందుకేగా
నీ అల్లరి మనసద్దంలో ఇలా కనిపిస్తుంది
నాకిష్టమైన అలికిడి అష్టపదిలా వినిపిస్తుంది
వశం కాని సుతారాలేవీ మీటకిప్పుడు
నా వేలికొసకు అంటని దూరాన్ని గుర్తుచేస్తున్నప్పుడు..😣💕

No comments:
Post a Comment