Saturday, 11 April 2020

// నీ కోసం 109 //

వసంతపు కుహూ కీర్తనలా
వేసవి మల్లె గాలిలా
వానాకాలపు వయసు విరహంలా
నీ కవితల మీదుగా పయనం
ఎంతో ఆహ్లాదం

తెలుసా నీ కవనం...
నీలాకాశానికి నిచ్చెనేయాలనిపించే వేకువలో
పసిడి వెలుగు చందనం చల్లినట్లు
ప్రణయమంత్రమేసే తీపి సంగీతం

అలలహోరుని లెక్కచేయక
సముద్రపు ఒడిలో సేదతీరే ముత్యంలా
మనసుకిదో ఇష్టమైన నిశ్శబ్దపు చుంబనం

కౌగిలి రాయబారానికి కబురెట్టిన కలలో
కాలపు దోబూచులాటకు దొరకని ఆనందంలా
అదో అనిర్వచనీయపు భావుకత్వం 💜💕

No comments:

Post a Comment