తెలివెన్నెల్లో తడిచిన నందివర్థనపు ఒణుకు
ఏకాంతానికి చలి పుట్టించిందంటే
నా అంతర్లోకపు దారి దానికెట్లా తెలిసిందో
క్షణానికింత విరహమని లేతగాలి
అదేపనిగా నీ ఊసులే చెప్తుంటే
గుప్పెడు గుండెలో ఒలికింది మకరందమేననిపిస్తుంది
ప్రణయాక్షరాలు లయగా ఈ స్వప్నసరాగం
గొంతెత్తి తీయగా నన్ను పిలిచిందంటే
హేమంతపు చలిమంటల వెచ్చదనం నాకిందించేందుకేమో
మనసు కల్పించుకున్న ఆస్వాదనకే
ఇంత సుగంథమైతే
నీకోసమే కళ్ళు తెరిచిన నాదెంత పరవశమో
నన్ను నాకివ్వకుండా
ఇంకెంత దూరానికి లాక్కెళ్తుందో
నువ్వెదురు చూస్తున్నావంటూ ఈ ఉదయం 💕💜
ఏకాంతానికి చలి పుట్టించిందంటే
నా అంతర్లోకపు దారి దానికెట్లా తెలిసిందో
క్షణానికింత విరహమని లేతగాలి
అదేపనిగా నీ ఊసులే చెప్తుంటే
గుప్పెడు గుండెలో ఒలికింది మకరందమేననిపిస్తుంది
ప్రణయాక్షరాలు లయగా ఈ స్వప్నసరాగం
గొంతెత్తి తీయగా నన్ను పిలిచిందంటే
హేమంతపు చలిమంటల వెచ్చదనం నాకిందించేందుకేమో
మనసు కల్పించుకున్న ఆస్వాదనకే
ఇంత సుగంథమైతే
నీకోసమే కళ్ళు తెరిచిన నాదెంత పరవశమో
నన్ను నాకివ్వకుండా
ఇంకెంత దూరానికి లాక్కెళ్తుందో
నువ్వెదురు చూస్తున్నావంటూ ఈ ఉదయం 💕💜
No comments:
Post a Comment