మొదటి నక్షత్రం కనపడగానే
మనసుకైన ఆనందం
నువ్వు నన్ను తలచినట్టి సంకేతమనుకున్నా..
క్షణానికో ప్రపంచంలోనికి కదిలానంటే
చూపులాపలేని చిరుస్వప్నంలో
నీ చిరునామాకని వెతుకుతున్నట్టు... తెలుసా..
నలుమూలల నిశీధి నిశ్శబ్దంలో
నిన్ను చేరాలని నలుగుతున్న తపన
సుతిమెత్తని స్వరమై వలపించింది విన్నావా..
కలువరేకుపై నీహారికా బిందువులా
నీకు తగలకుండానే నిలుచున్నానంటే
నా మనోగతం మౌనంగా విరచించినట్టు..తెలుసా
కాలాన్నేం సాయమడగకు..
నీకు లాలింపునందించేందుకు
కుంకుమపూల కన్నులతో ఎదురుచూపులు పరచి నేనున్నానిదిగో .. 💕💜
మనసుకైన ఆనందం
నువ్వు నన్ను తలచినట్టి సంకేతమనుకున్నా..
క్షణానికో ప్రపంచంలోనికి కదిలానంటే
చూపులాపలేని చిరుస్వప్నంలో
నీ చిరునామాకని వెతుకుతున్నట్టు... తెలుసా..
నలుమూలల నిశీధి నిశ్శబ్దంలో
నిన్ను చేరాలని నలుగుతున్న తపన
సుతిమెత్తని స్వరమై వలపించింది విన్నావా..
కలువరేకుపై నీహారికా బిందువులా
నీకు తగలకుండానే నిలుచున్నానంటే
నా మనోగతం మౌనంగా విరచించినట్టు..తెలుసా
కాలాన్నేం సాయమడగకు..
నీకు లాలింపునందించేందుకు
కుంకుమపూల కన్నులతో ఎదురుచూపులు పరచి నేనున్నానిదిగో .. 💕💜
No comments:
Post a Comment