Saturday, 11 April 2020

// నీ కోసం 101 //

ఎన్ని మధురవచనాలు మోసి అలసిపోయిందో మేఘమాల
కాలాన్ని మనకందించి కదులుతోందలా మెల్లగా..

ఇన్నాళ్ళూ తలపువాకిట నిలిచిన స్వప్నం
ఇతిహాసం మొదలెట్టేందుకు ఉవ్విళ్ళూరుతున్న తరుణమిది

కన్నులు కలవరపడుతున్నా కవితలవుతున్న రెప్పలు
నువ్వు చదవాలని తొందరపడుతున్న సందళ్ళతో

నిన్ను చూసేందుకు బరువెక్కుతున్న క్షణాలు
నిద్దురనిటు రావొద్దని లాలించి బుజ్జగిస్తున్న రాతిరిది

నా మనసు తెలుసుకున్న ఆకాశం.. వెన్నెలకళ్ళాపి చల్లి
నక్షత్రాల రంగవల్లి దిద్ది నిన్నాహ్వానించమంది

పున్నమి పండుగ మనకి ప్రత్యేకమని
సంతకం చేసేందుకు మన మోహార్తిని ఊహిస్తూ ఎదురుచూస్తుంది జాబిలి..💕💜

No comments:

Post a Comment