కొన్ని క్షణాల నిశ్శబ్దం
పెదవులను తాకి చిరునవ్వుగా మారితే
మనం మాట్లాడుకుంటున్నట్లు అర్ధం కదా
వెన్నెల వేడెక్కేంతగా
చూపులు అరమోడ్పులైతే
గుండెల్లోని జీర గొంతులోకొచ్చి ఆగి
నాలో వలపు వేదం నెమరింతై తొణికినట్లు
చెప్పూ..
నిజంగా నేను అతిశయించానా
కలగా నన్ను పలకరించి
నీలోకి రమ్మంటూ.. ఇష్టంగా పిలిచింది నువ్వే కదా
అప్పుడు మొదలైన పాట
ఆకులు రాలుతున్నా ఆగదన్నట్టు
నీ కౌగిలిలో కంపించి పులకించేలా
నా మనోగతాన్ని నీకు చేరేస్తుందలా
రోజుకింత అనుభూతి కావాలని అడిగావుగా ఒకసారి
అల్లనల్లన నీ నేత్రాంచలాన
ఆనందభాష్పమయ్యానో లేదో తడిమి చూసుకో ఈసారి..😉💕
పెదవులను తాకి చిరునవ్వుగా మారితే
మనం మాట్లాడుకుంటున్నట్లు అర్ధం కదా
వెన్నెల వేడెక్కేంతగా
చూపులు అరమోడ్పులైతే
గుండెల్లోని జీర గొంతులోకొచ్చి ఆగి
నాలో వలపు వేదం నెమరింతై తొణికినట్లు
చెప్పూ..
నిజంగా నేను అతిశయించానా
కలగా నన్ను పలకరించి
నీలోకి రమ్మంటూ.. ఇష్టంగా పిలిచింది నువ్వే కదా
అప్పుడు మొదలైన పాట
ఆకులు రాలుతున్నా ఆగదన్నట్టు
నీ కౌగిలిలో కంపించి పులకించేలా
నా మనోగతాన్ని నీకు చేరేస్తుందలా
రోజుకింత అనుభూతి కావాలని అడిగావుగా ఒకసారి
అల్లనల్లన నీ నేత్రాంచలాన
ఆనందభాష్పమయ్యానో లేదో తడిమి చూసుకో ఈసారి..😉💕
No comments:
Post a Comment