నీ ఊపిరి స్వరలయలకేమో
కాలాన్ని కోల్పోయిన సాయింత్రం
రాలిన పూలన్నీ పదాలై..మాలలైనట్టు
నేనంతా మెత్తని పరిమళమై వివశమయ్యా
ఆకాశం కరిగి మంచు కురిస్తే
భూమి తడిచి సంతోషాన్ని వెదజల్లేవేళ
నేనో మృదువైన స్పర్శని కలగంటూ
నువ్వెదురైనట్టే కలవరిస్తున్నా
నీ చిలిపి కన్నుల ఛాయలోని
పొద్దుతిరిగినట్టి ప్రతిరూపం
నాదని నీకు తెలుసు కనుకే
నా కదలికలకింత లాలింపని పులకరిస్తున్నా
మనసూపుతున్న ఉయ్యాలలో నువ్వాడుతున్న ఆటలన్నీ
నన్ను పొగిలించే నీ తపనగా అనుకున్నాక
ఈ సశేషానికి మురిసిపోతున్నా 💜💕
కాలాన్ని కోల్పోయిన సాయింత్రం
రాలిన పూలన్నీ పదాలై..మాలలైనట్టు
నేనంతా మెత్తని పరిమళమై వివశమయ్యా
ఆకాశం కరిగి మంచు కురిస్తే
భూమి తడిచి సంతోషాన్ని వెదజల్లేవేళ
నేనో మృదువైన స్పర్శని కలగంటూ
నువ్వెదురైనట్టే కలవరిస్తున్నా
నీ చిలిపి కన్నుల ఛాయలోని
పొద్దుతిరిగినట్టి ప్రతిరూపం
నాదని నీకు తెలుసు కనుకే
నా కదలికలకింత లాలింపని పులకరిస్తున్నా
మనసూపుతున్న ఉయ్యాలలో నువ్వాడుతున్న ఆటలన్నీ
నన్ను పొగిలించే నీ తపనగా అనుకున్నాక
ఈ సశేషానికి మురిసిపోతున్నా 💜💕
No comments:
Post a Comment