Friday, 10 April 2020

// నీ కోసం 86 //

పాలకడలి పొంగులోని పొగరంతా
పెదవిలో దాచుకున్న ప్రేమాన్వీ..

ప్రశాంతమైన నీ కన్నుల కదలికలు
పాదరసానికి సమానమని నాకు తెలుసు

వచ్చేది కల్లోకే అయినా
ఈ దూరమైతే చెరిగిపోతుందిగా మనమధ్య

కాలం క్షణాలుగా కరిగిపోతున్నా
ఈ నిరీక్షణను అంతం చేయవేమి

అష్టపదులతో అల్లాడిపోతున్నా
రవ్వంత ఆర్తిని సరాగాల గంధం కానీయవే

నిద్రొస్తోంది రా..
తమకం తుంపరగా రాలుతున్న వేళ
నిశ్శబ్దంతో మనసుని పెనవేసేందుకు త్వరగా రా..😉💜

No comments:

Post a Comment