అంతుచిక్కని మనసు అంతఃస్వరం
ఈ పున్నమివేళ మెల్లగా కదిలి
మౌనప్రవాసం వీడింది
పూసే నవ్వులన్నీ నీలాకాశపు నక్షత్రాలై
అనుభూతిని అతీతం చేసిన స్పందన
ఉద్గ్రంధమై ఉచ్ఛ్వాసను నింపింది
తనువు తాకిన పూలధనువు
తలపుల ద్వారాన్ని తెరిచి
నీకివ్వాల్సిన ముద్దులను గుర్తుచేసింది
రెప్పల్లో విరిసిన వెన్నెలకెరటం
దూరానున్న నిన్ను అందుకొనేందుకు
సంగీత విన్యాసపు వంతెనేసింది
ప్రణయమృదంగం మొదలవ్వాలిప్పుడు
హేమంతపు తపస్సమాథి
పసిడిక్షణాల పరం చేసేందుకు 💜
ఈ పున్నమివేళ మెల్లగా కదిలి
మౌనప్రవాసం వీడింది
పూసే నవ్వులన్నీ నీలాకాశపు నక్షత్రాలై
అనుభూతిని అతీతం చేసిన స్పందన
ఉద్గ్రంధమై ఉచ్ఛ్వాసను నింపింది
తనువు తాకిన పూలధనువు
తలపుల ద్వారాన్ని తెరిచి
నీకివ్వాల్సిన ముద్దులను గుర్తుచేసింది
రెప్పల్లో విరిసిన వెన్నెలకెరటం
దూరానున్న నిన్ను అందుకొనేందుకు
సంగీత విన్యాసపు వంతెనేసింది
ప్రణయమృదంగం మొదలవ్వాలిప్పుడు
హేమంతపు తపస్సమాథి
పసిడిక్షణాల పరం చేసేందుకు 💜
No comments:
Post a Comment