నిశిరాత్రి ఏకాంతంలోని నిశ్శబ్దం
అనంతాకాశపు కోట్లతటిల్లతల సమ్మోహన సమూహం
చూపులతో పిలిచినందుకేమో..
పువ్వులరెక్కలపై తేలుతూ నేనొచ్చేసాక
అమాంతం నన్ను వెన్నెల్లోకి తీసుకుపోయి..
మదిలో ప్రవహిస్తున్న మత్తునంతా
ఒక్క ముద్దుతో చెరిసగం చేసేస్తావు..
ఒంటరితనపు పుటల్లోని ఆవేదనని
చీకటిలో ఉండవలసిన గతాన్ని
రేపటి వేకువతో జయించుదాం రా..
తీపి నిశ్వాసలతో వెచ్చబడి
మనసుకి గాయం చేస్తున్న ప్రేమవ్యసనాన్ని
ఆత్మీకరించుకుందాం
ఆకుచాటు వెన్నెల్లో మొదలైన మృదునాదం
నీ హృదయానిదని నాకెప్పుడో తెలుసు
ఇంకేం చెప్పకు..నీలోని సంగీతం నాకో సంతోషమిప్పుడు 💜💕
అనంతాకాశపు కోట్లతటిల్లతల సమ్మోహన సమూహం
చూపులతో పిలిచినందుకేమో..
పువ్వులరెక్కలపై తేలుతూ నేనొచ్చేసాక
అమాంతం నన్ను వెన్నెల్లోకి తీసుకుపోయి..
మదిలో ప్రవహిస్తున్న మత్తునంతా
ఒక్క ముద్దుతో చెరిసగం చేసేస్తావు..
ఒంటరితనపు పుటల్లోని ఆవేదనని
చీకటిలో ఉండవలసిన గతాన్ని
రేపటి వేకువతో జయించుదాం రా..
తీపి నిశ్వాసలతో వెచ్చబడి
మనసుకి గాయం చేస్తున్న ప్రేమవ్యసనాన్ని
ఆత్మీకరించుకుందాం
ఆకుచాటు వెన్నెల్లో మొదలైన మృదునాదం
నీ హృదయానిదని నాకెప్పుడో తెలుసు
ఇంకేం చెప్పకు..నీలోని సంగీతం నాకో సంతోషమిప్పుడు 💜💕
No comments:
Post a Comment