కనుచూరుల్లో ప్రవహిస్తున్న కాంతి
నిన్నారాధిస్తున్న పరవశమైతే
నేనో కవితనై నీతో చదివించుకోలేనా
అలలై కదులుతున్న మేఘాలు
కలలో నువ్వాడిన ఊసులనే వినిపిస్తుంటే
మనసు నింపుకున్న మోహంతో మైమరచిపోలేనా
తుమ్మెదరెక్కలను సవరిస్తున్న మునివేళ్ళు
మురిపాలు ముద్రిస్తున్నట్లనిపిస్తే
తడిచిన వేకువ జాబిలిలా వివశించలేనా
రెట్టింపైన వెచ్చని ఊపిరి
క్షణాల్ని మౌనంగా కరిగిస్తుంటే
లోకికప్రపంచానికి దూరంగా జరిగానని తెలుసునా
నీ నిరీక్షణలో రేయంతా లెక్కించిన చుక్కలు
వరుసతప్పి ఉక్కిరిబిక్కిరి చేసాయంటే
ఈ అశాంతికి కారణం నువ్వేనని చెప్పేయనా 😉💜
నిన్నారాధిస్తున్న పరవశమైతే
నేనో కవితనై నీతో చదివించుకోలేనా
అలలై కదులుతున్న మేఘాలు
కలలో నువ్వాడిన ఊసులనే వినిపిస్తుంటే
మనసు నింపుకున్న మోహంతో మైమరచిపోలేనా
తుమ్మెదరెక్కలను సవరిస్తున్న మునివేళ్ళు
మురిపాలు ముద్రిస్తున్నట్లనిపిస్తే
తడిచిన వేకువ జాబిలిలా వివశించలేనా
రెట్టింపైన వెచ్చని ఊపిరి
క్షణాల్ని మౌనంగా కరిగిస్తుంటే
లోకికప్రపంచానికి దూరంగా జరిగానని తెలుసునా
నీ నిరీక్షణలో రేయంతా లెక్కించిన చుక్కలు
వరుసతప్పి ఉక్కిరిబిక్కిరి చేసాయంటే
ఈ అశాంతికి కారణం నువ్వేనని చెప్పేయనా 😉💜
No comments:
Post a Comment