Thursday, 9 April 2020

// నీ కోసం 78 //

అనంతవిశ్వంలోని అందాలు దాచుకున్నట్టు
ఎప్పుడూ ఏ అద్భుతాన్ని తిలకిస్తుంటాయో.
కొంచమన్నా కదలనివ్వవు నీ కళ్ళు
ఏం మాటలు కలపాలని చూస్తాయో కూడా తెలీదు

ఎన్నో పదాలు దాచుకున్న నీ పెదవులకు
మౌనమంటే మక్కువెందుకో అనుకున్నా ఇన్నాళ్ళూ
నీలో విషాదాన్ని తరిమేసి నా నవ్వుతో
మమేకమయ్యేందుకొస్తే సరిపోతుందిగా అసలు..

మబ్బులు కమ్మినా వర్షమూ రాదూ
అర్ధమరాతిరైనా నిద్దురా రాదు
కలలోని బంగారుప్రపంచం కల్లలైనట్టు
రాలిన పువ్వులచప్పుడు రాతలకందదు

అయినా సరే..
నా ఎదురుచూపుల తలుపులేమీ మూయను
ఎదలోకి తొంగిచూడాలనిపించినప్పుడే నువ్వు రా
మరోసారి నిశ్శబ్దాన్ని తెచ్చినా పర్లేదులే
ఆకాశంలో చుక్కలు కలిపే విద్య నాకు తెలుసిప్పుడు..💜💕

No comments:

Post a Comment