రోజంతా కాలపథాన్ని అనుసరించి అలసిపోయే నువ్వు
రాత్రైతే అరమగ్గిన సంకల్పాలను పక్కకు నెట్టి
నా కనురెప్పల ఊయల మీద బుజ్జి పాపవవుతావు
అర్ధప్రేరణివ్వని ఆలోచనలను సాగనంపి
అందమైన స్వర్గానికి దారి చెప్పమని
మనోహరమైన నవ్వులు విరజిమ్ముతావు
ఎప్పుడూ నిశ్శబ్దాన్నే ప్రేమించినట్టు కనిపిస్తూనే
వసంతపు కలలకు కొత్తరంగులద్దమని
గుండెనిండా రాగాలు నింపమంటూ గారాలొలుకుతావు
నీకూ తెలుసుగా..
No comments:
Post a Comment