Sunday, 9 May 2021

// నీ కోసం 319//

 _<\>%^*+!_<_?>|?!


_

హమ్మ 

<\>%

ముందూ వెనుకా చూడకుండానే తన సౌందర్యపిపాసను వెదజల్లుతున్నాడే !

^*
పైకెప్పుడూ  సముద్రాన్ని ప్రేమిస్తూ కనిపిస్తాడు
సున్నితత్వాన్నే గమనించే భావకుడై ఉంటాడు

+!_

పైగా అనుభూతినెరిగిన ఆరాధకుడు
కానీ సుంతైనా తడిలేని ఎడారి ఒంటెగాడు

<_?>|?!

తనలోని లాలిత్యానికి 
మల్లెపూవు మధువొలికిన తుంపలు 
తాగినట్టవుతుంది మది

అల్లరి చేయడం తప్ప అన్యమెరుగకే
ఆకాశమంత విస్తరించిన జగన్నాటక సూత్రధారి 
ఇంకా నన్ను పాలించకుండా ఏ రాజ్యాల్ని జయించాలని
కాలం వృధా చేస్తున్నాడో మరి 


No comments:

Post a Comment