ప్రేమాన్వీ
స్వప్నలిపి సౌందర్యం మరెక్కడో లేదునిత్యం నేను కలవరించే నీ పేరులోనే ఉంది..
ఎందుకో చెప్పమని అడగవా..
ఈ నిశ్శబ్దం
వేయిజ్ఞాపకాల నీ పలకరింపులుగా
నా హృదయాంచలాన బంగారుకాంతులీని
తడికన్నుల్లో ప్రతిబింబిస్తుంది..
నీ మౌనం
ఊహాతీరాన పడున్న నన్ను నిద్రలేపి
ఒక్క పాటన్నా పాడవేమని
గొంతువిప్పి మాట్లాడుతుంది
ఓ భావం
ఇంతనురాగం దాచేందుకేముందని
పెదవుల్లో సున్నితంగా చేరి
పున్నాగవరాళి స్వరమై ఊగుతుంది
ఇప్పుడిక చెప్పేదేముంది
ఆకుచాటు వెన్నెల్లో నువ్వు...
నన్ను పొదుపుకున్న కలలు
తొలిపొద్దు కువకువలు వినబడేదాకా
తెరిపివ్వని అలలవుతాయి
No comments:
Post a Comment