నెలరాజా..
ఎన్నిసార్లు తిట్టుకుంటానో నిన్ను
విరహాన్ని రగిలించడంలో నీవే సాటివని
మనసుని హింసించడంలో ముందుంటావని
చల్లదనమిస్తూనే మంట పెడుతుంటావని
అయితే అదంతా అప్పుడప్పుడేలే..
తను నాతో ఉన్నప్పుడు నువ్వున్నట్టే అనుకుంటాలే
అప్పటి ఆహ్లాదాన్ని నీతో తప్ప పోల్చుకోనులే
మోహం తీరే మోజు కలగాలంటే నువ్వుండాలిలే
నీ పున్నమి పరిమళముంటే చాలు
మదిలో మైమరపు కరిగి..
నడుమున నెలవంక నలిగి..
తనలో నేనై కదిలి..
రేయి పరవశించాలంటే
నువ్వుండాల్సిందేలే
No comments:
Post a Comment