Sunday, 9 May 2021

// నీ కోసం 322//

ఈ సాయంకాలపు వర్షపు మరకలు
నా ఏకాంతానికి కవిత్వాన్ని పూసి
మృదువైన మైమరపు నీ మనోవాక్యంలా
కొన్ని మట్టివాసనల కౌగిలింతలని తెలుసా

కొంత కాలంగా కలవరపెడుతున్న నీ కళ్ళు
చినుకు శబ్దాల కొత్త అర్ధాలనే
ఓ అవ్యక్తపు స్వాతిశయ మౌనరాగంలా
నిలువెత్తు నా ప్రాణాలు హరిస్తున్నవి తెలుసా..

వసంతపు తెమ్మెర వరుస మార్చుకుని
అలలుగా ప్రవహిస్తున్నట్లు ఇటువైపుకొచ్చి
సంగీతపు తరగల మధ్య నీ జ్ఞాపకంలా
ఉండుండీ గమ్మత్తైన మత్తిస్తున్నదని తెలుసా

నీలో నీకు నవ్వుకోవడం రాలేదని
ఏదీ తెలీదని చెప్పకు
గుండె బరువెక్కి.. చూపు అరమోడ్చితే
ఆ చిన్న కదలికనే అనుభూతిగా దాచుకో .. 



No comments:

Post a Comment