Monday, 10 May 2021

//నీ కోసం 336//

 మత్తు చల్లే నక్షత్రాల్లా ఆ కళ్ళు

తేజస్సును పరిమళించే వెన్నెలపువ్వులు

మసక చీకట్లో మెరుస్తున్న ఆ నవ్వులు
నిద్దురపొద్దులను లాలించే స్వరసంచికలు

నాకోసం నువ్వన్న నాలుగు మాటలు
రసరంజని రాగాలాపనైన రతనాల రాసులు

మొత్తానికదేమో..
మనసు గోదారైన మంత్రజాల మహిమేమో  

No comments:

Post a Comment