నీ కోసం
Pages
హోం (కవితలు)
ఏక్ తారలు
ద్విపదాలు
త్రిపదాలు
పాటలు
నీకోసం
ప్రచురణలు
Monday, 10 May 2021
//నీ కోసం 326//
Turn off for: Telugu
అపురూపాలు చలిస్తున్న అల్లరులు
రాత్రికి రంగులు పూస్తాయేమో మరి
మన నవ్వుల్లో మిణుగురు దీపాలు వెలుగుతాయి
నీ పారదర్శకమైన మొహంలో
నా మీద ప్రేమ
మనసు నిండిన తీపిని చూపిస్తుంది
నిశ్శబ్దాన్ని శృతి చేస్తూ
ఆ పెదవుల చివర్న ఆగిన మాటలు
మోహాన్ని దాచలేక మైమరపులు చిందుతాయి
కొసరి కొసరి చూసే ఆ చూపు
నాలోని విరహాన్ని తరిమేట్టు
కొన్ని చెమరింపులు చల్లుతుంది
క్షణానికోలా లుప్తమయ్యే కాలం
నీలో మాధుర్యానికి ప్రతిస్పందించినట్టు
మెల్లిగా నాలో ఇమిడిపోతున్నప్పటి మహాద్భుతమనిపిస్తుంది
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment