ఎందుకిలా
జీవం కోల్పోయిన శిలలా నే నిశ్చలమైతే ఉలి పట్టుకునొచ్చేస్తావ్
ఏదో నిశ్శబ్దంగా నేనుంటే సీతాకోకలా ఎగిరమంటావ్
నాకు నేనో తీరంలా పడి ఉంటే కెరటంలా అనునయిస్తావ్
అయినా సరే..
నడిరాతిరి నీకోసం తలపులు తెరిచి ఎదురుచూస్తూ నిల్చుంటే
ఏమీ తోచక పలకరించాననుకుంటావ్
దీర్ఘశ్వాస తీసుకున్నప్పుడు ఊపిరిని గమనించుకోవేమో
నా ఆవేదనా నిట్టూర్పు బరువే కాదనుకుంటావ్
మంచుబిందువుల్ని చూసినప్పుడు నా తడికళ్ళు గుర్తురాకనే
కలుస్తూ విడిపోయే రెప్పల్లో క్షణానికోలా కలవరమవుతావ్
శీతాకాలం పగిలిన గాలికి వణుకుతున్న
పువ్వుల హృదయాన్ని ప్రశ్నించి చూడమాకేం..
అలుపెరుగక సమయమంతా నిన్నే కల్పించుకున్నానని
నీ పిలుపందక విచ్చుకోని పెదవుల గురించి చెప్పి బాధపెడతాయ్..
నాకన్నీ తెలుసనుకుంటున్న నీ మౌనానికి
తలుపులు వేసేస్తాలే ఇక..
Becoz I couldn't help but notice u
No comments:
Post a Comment