చానాళ్ళుగా వాదించుకున్న ఊహలు
అంతులేని అశ్రువుల ధాటికి ఓడిపోయాక
హృదయం కంపించడం మొదలెడుతుంది
కలల రెక్కలు తెగి
జీవితం బలహీనమయ్యాక
ఆకాశానికి ఎగరలేని వైనం
అరక్షణమైనా ఆశను ఇవ్వలేకపోతుంది
ఓదార్పు ఇవ్వలేని గాయాలు
దేహాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు
అసంఖ్యాక నిట్టూర్పులు
నిశ్శబ్దానికే దడ పుట్టిస్తుంటాయి
ప్రేమను వెతుక్కుని వేసారిన
ఒక ఊపిరి అలసి సొలసిపోయి
శూన్యాన్ని భరించలేక
ప్రాణాన్నే ధారపోయాలనుకుంటుంది
అశాంతికి హద్దులంటూ చెరిగిపోయాక
విషాదాంతమైనా కొన్ని శిక్షలు
అనుభవించి తీరాల్సిందేనని అర్ధమవుతుంది
No comments:
Post a Comment