Friday, 7 May 2021

//నీ కోసం 317 //

 ఏంటా నవ్వు

నాకిష్టమైన ఊదారంగు ద్రాక్షరసంలో ముంచుతూనే
ఉన్మత్తత చుట్టిముట్టినట్టు
మౌనంతో మనోహరంగా పాడొచ్చంటే ఒప్పుకోని నేను
నీ పెదవొంపుల్లో ఆలాపనలు ఆలకిస్తున్నా

కుంకుమపూలో.. మోదుగుపూలో 
చూసేకొద్దీ చెరో చెంపా ఎర్రగవుతుంటే
నీ మగసిరిలో పసిదనమేంటని పులకరిస్తున్నా

సుదూరతీరాలకవతల భ్రమలో ఉన్నాననకు
నా మనస్స్పందనకు ఆకాశం దూరమని తెలీదు
అదేమో.. నిన్ను చూస్తూ కాలాన్ని పొద్దుపుచ్చడమే తెలుసు 

No comments:

Post a Comment