అంతర్మధనం ఒకటే తెలుసనుకున్న మనసుకి
ఆనందించడమెలాగో నేర్పింది నువ్వే కదూజీవనగతిలో దార్శినికతను వెతిక్కునే
వియద్గంగలా
తామరాకు మీది నీటిబొట్టులా
నీ సా(న్ని)హిత్యమే నా సౌందర్యమై
మదిలో నవ్వులు పూసింది నిజమైతే
మనస్వీ..
మౌనంలో నీ స్పర్శ కొంచెం కొంచెం తెలుస్తుంది
ఈ అనుభూతి యోగాన్నిలానే ఉండనీ
No comments:
Post a Comment