Monday, 10 May 2021

//నీ కోసం 333//

 పులకరించడం తెలిసిన రాత్రికి

తారలతో నిండి ఉండటమో అతిశయమైతే
అంతరంగపు మధువును
నీకు రుచి చూపిన నా అందానికేం తక్కువ

వెన్నెల పుప్పొడి రాలుతూ చేస్తున్న
సజల హృదయ సవ్వడికి
మనసు మోదుగుపూల బుట్టల్లో జారిందంటే
మౌనవాసాన్ని వీడిన నీ నవ్వులకర్ధమేంటో

నా ఒడి నీ ప్రపంచమైన చిలిపికలలో
సప్తస్వరాలు ఏకంచేసి నే పాడుకున్న కృతి
మనస్సమర్పణకు మారుగా నీకిచ్చుకున్నా..
ఆపై...
చూపులతో లాలించడం తెలిసిన నీ కన్నులు
అటుఇటూ తప్పించుకోని విధంగా పెనవేసాక
ఈ అనుభూతి శాశ్వతం కావాలని కోరుకున్నా 

No comments:

Post a Comment