Monday, 10 May 2021

//నీ కోసం 331//

 Turn off for: Telugu

"కన్నీటిని ఆరనివ్వని రసగంధంలా
గుండెని అంటిపెట్టుకున్న స్మృతుల తోడు
బహురూపాలుగా తృపినందుకోగలదీ ప్రాణం"
ఈ మాటన్నందుకేనా..
ఎందుకు నన్నేమీ అడగవు

ప్రవాహంగా కదులుతున్న నీటికి
నిశ్చలం తెలియనట్టు
కోపమూ అలకా కానీ ఈ నిశ్శబ్దానికి
పేరూ తీరూ ఏముందసలు

నా మౌనపు క్షణాలన్నీ మునివేళ్ళను వదిలి
అలిగి కూర్చున్నాక
ముభావమైన భావాలన్నీ 
అవ్యక్తాన్ని మోస్తున్నట్టు పడుతున్న అవస్థ
నీకు తెలీసే వీల్లేదు


ఇప్పుడొచ్చి కొత్తఋతువు తనను ప్రకటించుకున్నా
ఈ విషాదాన్ని భగ్నం చేయలేదు
నాలోని  మధురిమనంతా తాగేసి
ఊహల ఉప్పుసంద్రం దగ్గర నిలబెట్టిన
నువ్వు రావలసిందే 

No comments:

Post a Comment