లోలోపల సందడి ఎక్కువై
కొత్తగా ఎర్రని చివురులేవో పూసినట్టు
పెదవుల్లో ఎందుకింత కమ్మదనం
సగం సగం మూసుకుపోతున్న కన్నులతో
నాకు నేనుగా నీలో చేరి ఇమిడిపోయిన
కౌగిలిలో ఏదో తెలియని తమకం
మనోవేగంతో ఎప్పుడిలా వచ్చావో
లోకానికి దూరంగా ఉండాలనుందీ రోజంతా
ఒక్క నీతోనే మమేకమవ్వాలని మనసంత కలవరం
No comments:
Post a Comment