Monday, 10 May 2021

//నీ కోసం 332//

 ఒక హృదయం స్పందించాలనంటే

ఉద్వేగాన్నీ, చైతన్యాన్ని
నిశ్చలత్వాన్ని సమానస్థితిలో స్వీకరించుండాలి

నిరంతరం యుద్ధం చేస్తూ 
మనల్ని ఓడిపోయేలా చేసేవి
లోలోపలి అరిషడ్వర్గాలు

కొన్ని అనుభవాలు జీవితానికి
కొత్త పూలబాటను ఏర్పరిచితే
కొన్ని కష్టాలు, భవిష్యత్తుని భయపెట్టేలా చేస్తాయి

చానాళ్ళుగా బ్రతికున్నానని అనుకున్నా..
జీవితమంటే విమర్శించీ విశ్లేషించీ కాక
ఇముడ్చుకునీ.. ఆస్వాదించేదని
అనివార్య ప్రేమలోని..
వ్యామోహాన్ని నిర్మోహంగా, తద్వారా 
అర్ధవంతంగా ఉండొచ్చని నిన్ను అనుసరించాకేగా తెలిసింది 

No comments:

Post a Comment