Sunday, 9 May 2021

// నీ కోసం 321//

 ఏ క్షణమైనా నువ్వింతే కదూ

మౌనాన్ని సాహిత్యంలా
సాన్నిహిత్యాన్ని సంగీతంలా మార్చేస్తూ

నీ కనురెప్పల్లోని రాగం
నా కలలో నిరంతర మోహమై
నిశ్శబ్ద ధ్యానమౌతుంది చూడు..

నాకైతే..
నువ్వనే కొన్ని పదాలు తియ్యగా
ఇంకొన్ని వాక్యాలు మత్తుగా
మైనంపువ్వులై కరుగుతూ
పరిమళిస్తున్నట్టనిపిస్తాయి

Yess.. u speak like a poem..

కొన్ని యుగాల సరిపడా పరవశమో
మరిన్ని ప్రేమగీతాల కలస్వనమో
నీలోని ఈ మనోహరావేశమే..
నాకు మహాద్భుతారాధనగా
ఒప్పుకోవూ.. 
 


No comments:

Post a Comment