Saturday, 31 October 2020

// నీ కోసం 208 //

కాలం కలవరించినప్పుడు దిక్కులు దాటి నువ్వొస్తావని నమ్ముతున్నాను జీవితం శబ్దించనప్పుడు నీకేమవుతానో ఆలోచించేందుకు నాకు నేనుగా విశ్రాంతినొందుతాను ఖాళీ అయిన గుండెలోకి చేస్తున్న ఒంటరిపయనంలో తోడొకరుంటారని నువ్వనుసరించినప్ప్పుడే కనుగొన్నాను మనసు దప్పిక తీర్చేందుకు చీకటిని నీడచేసి..మెత్తగా ఎదలోకి సర్దుకుంటావనే చేయి చాచాను ఆత్మానుగతమైన ప్రేమొక్కటే శాశ్వతమని క్షణానికొకలా సాగే ఊపిరి విన్యాసాన్ని గాలి పీల్చినప్పుడంతా గమనించాను నిన్నాలపించని రాత్రిని ప్రేమించవెందుకంటే ఏం చెప్పను కొన్ని పాటలు దూరాన్ని దగ్గర చేసే మంత్రాలవుతాయని నీకూ తెలిసినప్పుడు 💜💕

No comments:

Post a Comment