Friday, 30 October 2020

// నీ కోసం 197 //

మనసు తోటలో నే చేసిన స్వరార్చనకి నువ్వు తాళమేయలేదూ నీ పొడారిన గొంతులో తడి సుగంధం నేను కాలేదూ దీపాలు నీటిలో తొంగిచూసే వేళ.. నవ్వుతున్న నీ అరకన్నుల్లో మమేకమై.. సగమైపోలేదూ అయినా ప్రతీక్షణలో క్షణక్షణం జ్వలిస్తూ తొలిపరిచయంలా అనిపిస్తావెందుకు.. ఒంటరితనం ఒక్క దేహానిది కాదని నీ రెప్పల క్రీనీడలో రూపం నాదైనప్పుడు.. నువ్వూ నేనూ ప్రేమా వేరుకాదని నీకెవ్వరు చెప్పాలిప్పుడు..💜💕

No comments:

Post a Comment