Wednesday, 7 October 2020

// నీ కోసం 175 //

కన్నీరు నిండిన రెప్పలమాటు ప్రవాహం అర్ధరాత్రి అరచేతుల్లో చీకటికి సమానమైంది నీవుండగా క్షణాల్లో కరిగి పులకరించిన కాలం ఇప్పుడు దిగంతాల్లో సొమ్మసిల్లినట్టుంది ఆకాశంలో విద్యుల్లతలు ఎదలో సంగీతాన్ని నింపుతున్న వేళ నా ఆనంద తన్మయత్వం మాత్రం అంతులేని దూరానున్న నీతోనే ఉండిపోయింది గాలికి అభివ్యక్తి నేర్పి నిన్ను స్పర్శించమన్నా కళ్ళు తెరిచి కలగంటూ ఉండిపోమాకలా నీ తపనకు రెక్కలొస్తే నావైపు రమ్మంటున్నా చెక్కిళ్ళలో కొన్ని చిరునవ్వులు వెంటేసుకొచ్చెయ్యలా.. అదిగో సముద్రం మనకోసమే ఎదురుచూస్తుంది ప్రేమగీతాన్ని గదిలో వదిలేసి రాకు రేయంతా అలల హద్దులు చెరిపేసి పాడుకుందాం ఆపై ఒడి పల్లకీలో ఒళ్ళు మరచిపోదాం 💜💕

No comments:

Post a Comment